- నెలకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేత
- మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా
మెదక్ జిల్లా శివంపేట మండలం వెంకయ్య తాండకు చెందిన బానోత్ కుమార్ అకస్మాత్తుగా మృతి చెందాడు. ఆ విషయాన్ని తాండ వాసుల ద్వారా తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం అయిదు వేల రూపాయలు నగదు మరియు నెలకు సరిపడే నిత్యవసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆంజనేయులు, విఠల్ కోళ్ల రాజు, కిట్టు , తాండ వాసులు పాల్గొన్నారు.