అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గుత్తి మండలం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి గుమ్మనూరు నారాయణ పిలుపుమేరకు విజయవాడ వరద బాధితుల సహాయార్థం గుత్తి మండలంలోని ప్రజలు పెద్ద ఎత్తున సహాయం చేసి పెద్ద మనసును చాటుకున్నారు. ఎన్డీఏ కూటమి శ్రేణులు దాదాపు 200 బియ్యం బస్తాలను సేకరించి స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి అందజేశారు. ఈ బియ్యం బస్తాలను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం విజయవాడ వరద బాధితులకు చేరుస్తానని తెలిపారు.