- పాల్గొన్న పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, పటాన్చెరు డిఎస్పి రవీందర్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా/ అమీన్ పూర్: అమీన్ పూర్ లో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారు ఏర్పాటుచేసిన వినాయక నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్, పటాన్చెరు డిఎస్పీ రవీందర్ రెడ్డి, అమీన్పూర్ సిఐ సదా నాగరాజు, అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పలువురు కౌన్సిలర్లు, నాయకులు మరియు వేలాదిగా భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మహా అన్న ప్రసాదం నిర్వహించిన అతెల్లి బాలమణి, ఈశ్వర్ రెడ్డి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు రాంరెడ్డి, శశిధర్ రెడ్డి, సుధాకర్ యాదవ్, కుమ్మరి శ్రీను, పెద్ద మల్లేష్ యాదవ్, బిల్లీ శ్రీనివాస్ యాదవ్, దేవులపల్లి మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, రాములు గౌడ్, భిక్షపతి, బైసా కృష్ణ, జంగయ్య, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.