కరీంనగర్ జిల్లా: రేపు కరీంనగర్ లో జరిగే గణేష్ నిమజ్జనం కోసం మానకొండూరు చెరువు వద్ద ఏర్పాట్లను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. నిమజ్జనం కోసం ఇక్కడ ఇబ్బందులు లేకుండా చూడాలని కరీంనగర్ కలెక్టర్, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.. శోభాయాత్ర సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు నిమజ్జనం జరిగే ప్రదేశంలో లైటింగ్ ఇతర ఏర్పాట్ల పై సూచించారు.. చెరువు వద్ద చేయాల్సిన ఏర్పాట్ల పై అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్ (స్థానిక సంస్థలు), లక్ష్మి కిరణ్ (రెవెన్యూ), మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్ పాయ్,ఆర్డీవో,పోలీస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.