contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పిన్నెల్లి కి ఎదురుదెబ్బ …. వైసిపి నుండి టిడిపిలోకి వలసలు

  • మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 50 బీసీ కుటుంబాలు

 

పల్నాడు జిల్లా , వెల్దుర్తి :  మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన కల్లకుంట గ్రామానికి చెందిన 50 బీసీ కుటుంబాల వారు  వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరితో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పగలు ప్రతీకారాలకు దూరంగా నియోజకవర్గంలోని గ్రామాల ప్రజల గ్రామాభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :