కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలం లోని 16 గ్రామాలలో తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం సందర్బంగా జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది. 17.09.2024 నుంచి 02.10.2024 వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమము ప్రారంభించడం జరిగింది. అన్నీ గ్రామాలలో స్వచ్ఛ ప్రతిజ్ఞ మరియు అమ్మ పేరుతో ఒక్క మొక్క నాటడం, ఇంకుడు గుంతల మార్కింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమంలో ఎంపీడీఓ తీగల శంకర్, గన్నేరువరం కార్యదర్శి వెంకటరెడ్డి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.