మెదక్ జిల్లా తూప్రాన్ : తెలంగాణ సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతిసేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం పై నిరసన తెలియజేస్తూ మంగళవారం తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు సరాఫ్ సతీష్ చారి, ఉద్యమ నాయకులు మన్నె శ్రీనివాస్ రావు, నాయకులు కిష్టారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బురాన్, సత్తార్, మామిండ్ల అనిల్ కుమార్, కుమ్మరి చెలిమెల జయరాం, తలారి బాలేష్, కిష్టాపూర్ రవి, తాటి విశ్వం, నాని, బంధేలా నరేష్ తదితరులు పాల్గొన్నారు.