వెల్దుర్తి తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని వెల్దుర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం గ్రామసభ నిర్వహించారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన గ్రామసభలో గ్రామ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై పలు తీర్మానాలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీ ఈవో బలరాం రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభలో పలు తీర్మానాలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం మహాత్మా గాంధీ జాతీయ గ్రామాన్ని ఉపాధి హామీ పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ బోయిన్ రాములు ఉపాధి పనుల గురించి చదివి వినిపించగా గ్రామస్తులు గ్రామపంచాయతీ ఈవో బలరాం రెడ్డి మాజీ ఎంపీటీసీ జగ్గా అశోక్ గౌడ్ భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ఏ శ్రీనివాస్ గౌడ్ ఇతర గ్రామస్తులు పాల్గొన్నారు









