ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ఎం.వేములపాడు, పి.తక్కెళ్ళపాడు గ్రామాల్లో రెండు రేషన్ దుకాణాల్లో స్టాకు కన్నా అధికంగా 65 బస్తాల రేషన్ బియ్యం ఉండటంతో ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక తనిఖీ చేసి రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి 6(A) కేసు నమోదు చేశారు.
ఎం .వేములపాడు గ్రామంలో షాప్ నెంబర్ 38 కు చెందిన నీలం సింగయ్య రేషన్ దుకాణం, పి .తక్కెళ్ళపాడు గ్రామంలో షాప్ నెంబర్ 42 కు చెందిన సుబ్బారావు రేషన్ దుకాణం కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాహ సిల్దార్ షేక్ ఫిరోజ్ బాషా, పొదిలి ఎఫ్ ఐ ప్రమోదులు లకు వచ్చినా ఫిర్యాదుల మేరకు తనిఖీ చేసి అదనంగా ఉన్న 65 బస్తాల రేషన్ బియ్యం ను సీజ్ చేసి 6(A) కేసు నమోదు చేసి,పట్టుబడిన రేషన్ బియ్యం వీఆర్వోలకు అప్పగించారు.