contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Pakala : టిడిపి చోటా నాయకుడి కబ్జా .. పట్టించుకోని అధికారులు

  • కాలువ గట్టు.. కూడా వదలని టిడిపి చోటా నాయకుడు
  • పాకాల దినసరి మార్కెట్ వద్ద కాలువపై అక్రమ నిర్మాణాలు
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోని పంచాయతీ అధికారులు
  • రూ.25 లక్షల కాలువ భూమిని కొట్టేసిన టీడీపీ నేత
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో  తెలుగుదేశం పార్టీ కి చెందిన పాకాల మండల స్థానిక ప్రజా ప్రతినిధి సమీప బందువు తాజాగా మురుగు కాలువలను సైతం వదిలిపెట్టడం లేదు. కాలువ గట్టుతో పాటు మురుగు కాలువలపైనే కాంక్రీట్ వేసి మరీ దుకాణాలను నిర్మిస్తున్నారు. టీడీపీ కి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధి  కనుసన్నల్లో వీరు ఆక్రమణలకు పాల్పడుతుండటం, అడ్డుకోవాల్సిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు పత్తా లేకుండా పోవడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాకాల మండల జడ్పీటీసీకి సమీప బందువు, స్థానిక ప్రజాప్రతినిధికి ముఖ్య అనుచరుడైన ఓ అధికార పార్టీ నేత అక్రమాలు పెచ్చుమీరుతున్నాయి. మండల కేంద్రంలో ప్రభుత్వ భూములను అప్పన్నంగా కాజేస్తున్నారు. తాజాగా మురుగు కాలువలను కూడా మింగేస్తున్నారు. కాలువను దర్జాగా కబ్జా చేస్తున్నప్పటికీ పాకాల పంచాయతీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
పాకాల పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోని డైలీ మార్కెట్ కు ఆనుకుని అతి పెద్ద మురుగు కాలువ ప్రవహిస్తోంది. ఆ కాలువకు ఆనుకుని యున్న గట్టుపై స్థానికి ప్రజా ప్రతినిధి ముఖ్య అనుచరుడు కన్ను పడింది. ఇంకే ముందీ రాత్రికి రాత్రి గట్టుతో పాటు కాలువపై కూడా కాంక్రీట్ వేసి ఆగమేఘాల మీద రేకులతో షెడ్డు ఏర్పాటు చేసేశాడు. ప్రతి రోజు కాయగూరలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు వచ్చే స్థానిక ప్రజలు అడ్డగోలుగా కాలువపై నిర్మాణాలు చేపట్టడాన్ని చూసి ఇంత దుర్మార్గమా..? అడిగేవారు లేరా..? అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రూ.25 లక్షల ప్రభుత్వ ఆస్తిని కొట్టేసిన టీడీపీ నేత
పాకాల మండల కేంద్రంలో భూముల విలువ విపరీతంగా పెరగడంతో పెద్ద కాలువపై సుమారు రూ.25లక్షల విలువ చేసే 30 అంకణాలు ప్రభుత్వ భూమిని అప్పన్నంగా కొట్టేశారు. స్థానిక జడ్పీటీసీకి సమీప బందువు ఓ చోటా నాయకుడు ఇంత దుర్మార్గంగా విలువైన భూమిని కాజేసినప్పటికీ అడ్డుకోవాల్సిన పంచాయతీ అధికారులు అటువైపు చూడటానికి కూడా సాహసించడం లేదు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోక పోవడంతో ఆక్రమణ దారుడు వారం రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేసినట్టు సమాచారం. తాజాగా ఆ స్థలంలో విద్యుత్తు సర్వీసుకు దరఖాస్తు చేసుకుని సరఫరా తీసుకునే పనిలో వున్నట్లు తెలుసింది. అసలే మురుగు కాలువల్లో నీరు సరిగా పారకుండా వర్షం పడితే చాలు పాకాల పట్టణం మురుగుమయం అవుతుంటే అధికార బలంతో టీడీపీ నేతలు ఇలా అతి పెద్ద కాలువలను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేయడం పట్ల ప్రజా సంఘాలు, ప్రజల నుంచి వ్యతిరేఖత వ్యక్తమవుతోంది. ఇలాంటి చోట నాయకులు వల్ల టిడిపి పార్టీకి, స్థానిక ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని స్థానిక నాయకులు విమర్శిస్తున్నారు. దీనిపైన ఉన్నత అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని కోరుతున్నారు.
Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :