contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జనసేన స్థానిక ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశం .. జనసేనలోకి భారీగా చేరికలు

  • స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలి: జనసేన నేతల పిలుపు

 

జియ్యమ్మవలస: పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం డంగభద్ర గ్రామంలో కురుపాం నియోజకవర్గ జనసేన పార్టీ స్థానిక ఎన్నికల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఈ సమావేశంలో నేతలు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్, కడ్రక మల్లేశ్వరరావు, లచ్చిపతుల రంజీత్ కుమార్ ముఖ్య అతిథులుగా, సమన్వయకర్తలుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులందరి విజయానికి ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని సూచించారు. కురుపాం నియోజకవర్గంలో కూటమి ధర్మాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తల అభిమతాలను గౌరవించాలని స్పష్టం చేశారు. పరస్పర సమన్వయం, ఐక్యతతో ముందుకు సాగితేనే ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు.

జనసేనలోకి 60 కుటుంబాలు

సమావేశంలో భాగంగా జనసేన పార్టీ విధానాలు, సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన డంగభద్ర పంచాయతీకి చెందిన సుమారు 60 కుటుంబాలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారిని నాయకులు సాదరంగా ఆహ్వానించి, అభినందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీల నాయకులు, జనసేన సమన్వయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కూటమి బలోపేతానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :