contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇంటింటి న్యాయ సేవల సర్వే

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గన్నేరువరం మండలం చాకలివానిపల్లి గ్రామంలో బుధవారం ఇంటింటి క్షేత్రస్థాయి సర్వే ప్రారంభమైంది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రధాన జిల్లా న్యాయమూర్తి ఎస్. శివకుమార్ అనుమతితో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

సర్వే ప్రారంభానికి ముందు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ రేపాక బాణవ్వ, మండల తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఎంపీడీఓ ఏ. శ్రీనివాస్ రెడ్డి పాల్గొని సర్వే విజయవంతానికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

అనంతరం ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లతో కూడిన ప్రత్యేక బృందాలు గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శించి సర్వే చేపట్టాయి. కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, విద్య, ఉపాధి, ఎదుర్కొంటున్న సమస్యలు, న్యాయపరమైన అవసరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు.

ముఖ్యంగా న్యాయ సహాయం అవసరమైనప్పటికీ అవగాహన లేకపోవడం లేదా ఇతర కారణాల వల్ల సేవలు పొందలేకపోతున్న అర్హులను గుర్తించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు ఉచిత న్యాయ సేవలపై విస్తృత అవగాహన కల్పించారు.

నాల్సా (NALSA) అమలు చేస్తున్న వివిధ పథకాలు, ఉచిత న్యాయ సహాయం పొందేందుకు అర్హతలు, దరఖాస్తు విధానం గురించి వివరించారు. అలాగే మహిళలు, బాలలు, వృద్ధులు, దివ్యాంగులు, కార్మికులు తదితర వర్గాలకు చట్టాలు కల్పించిన హక్కులు, రక్షణలు, సంక్షేమ నిబంధనలపై అవగాహన కల్పించారు.

సర్వే తొలి రోజు గ్రామంలోని 60 కుటుంబాలను సందర్శించి వివరాలు సేకరించారు. సర్వేలో పొందిన సమాచారాన్ని విశ్లేషించి అర్హులైన వారికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయవాదులను నియమించి న్యాయ సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కూన సంతోష్, పంచాయతీ కార్యదర్శి ఈ. రాజు, మండల ఆర్‌ఐ రఘు, వార్డు సభ్యులు, న్యాయ సేవల బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :