నెల్లూరు :- గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నెల్లూరు నగర తహసిల్దార్ కార్యాలయం నీట మునిగింది. సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. సిబ్బంది కార్యాలయానికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ఈ ప్రాంగణంలో నిత్యం ఇలాంటి సమస్య వెంటాడుతోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుచున్నారు.