పల్నాడు జిల్లా – మాచర్ల : పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ ఆలయ దేవస్థానం కమిటీ సభ్యులు పల్నాడు జిల్లా వైసిపి పార్టీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఆహ్వానించారు.
మాచర్ల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని దేవస్థానం కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వివరాలను ఆయనకు తెలియజేస్తూ, ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు.
అలాగే ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆహ్వానించారు.








