contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఫేక్ న్యూస్ ప్రచారం: సోషల్ మీడియాలో “జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లవు

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అవుతున్న ఓ వార్తపై స్పష్టత వచ్చింది. “జర్నలిస్టులపై అక్రమ కేసులు చెల్లవు.. 7 రోజుల్లో జర్నలిస్ట్ సంఘాలే నిర్ణయం తీసుకుంటాయి” అంటూ ప్రచారం జరుగుతున్న సమాచారం పూర్తిగా అవాస్తవమని తేలింది. జర్నలిస్టులపై నమోదయ్యే కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు అలాంటి ఎలాంటి తీర్పు ఇవ్వలేదని న్యాయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదే సమయంలో జర్నలిస్టు అనే గుర్తింపును దుర్వినియోగం చేసే అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రతి ఒక్కరూ తమను తాము జర్నలిస్టులుగా ప్రకటించుకుంటే సమస్యలు తలెత్తుతాయని, చట్టపరంగా అందరినీ జర్నలిస్టులుగా పరిగణించలేమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల స్పష్టం చేసినట్లు సమాచారం.

DPDP చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మీడియా సంస్థలు

మరోవైపు డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (Digital Personal Data Protection Act – DPDP Act) 2023, దానికి సంబంధించిన రూల్స్ 2025 నిబంధనలను సవాల్ చేస్తూ దేశంలోని 21 ప్రముఖ వార్తా సంస్థలు, డిజిటల్ మీడియా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

ఈ పిటిషన్‌లో NDTV, The Times of India, The Hindu, The Wire వంటి ప్రముఖ మీడియా సంస్థలు భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబర్ 17కి వాయిదా వేసింది.

మీడియా సంస్థలు తమ వాదనల్లో.. డిజిటల్ డేటా రక్షణ పేరుతో తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు స్వేచ్ఛాయుత జర్నలిజంపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో భాగంగా వార్తల్లో ప్రస్తావించే వ్యక్తుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలనే నిబంధన అమల్లోకి వస్తే వార్తా సేకరణ ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతాయని వాదించాయి.

ప్రస్తుతం ఈ అంశంపై సుప్రీంకోర్టు విచారణ కొనసాగుతోంది. అయితే జర్నలిస్టులపై కేసులకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :